29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మండల వ్యాప్తంగా బిసి బంద్ విజయవంతం

Must read

📰 Generate e-Paper Clip

  • స్వచ్ఛందంగా బంద్ పాటించిన పలు వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు
  • రిజర్వేషన్లు సాధించుకునే వరకు బిసి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు ఎల్లారెడ్డిపేట మండల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నెల 18వ తేదీన  శనివారం చేపట్టిన బంధు విజయవంతమయ్యింది.హోటల్లు వర్తక వ్యాపార సంస్థలు, పాన్  షాపులు,ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు,పాఠశాలలు  బంద్ పాటించాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ  రాచర్ల బొప్పాపూర్,రాచర్ల గొల్లపల్లి   మీదుగా ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ వరకు  బైక్  ర్యాలీ తీశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.బిసి బంద్ లో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకునేంతవరకు బీసీ జేఏసీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనాలని వారు  పిలుపు నిచ్చారు.ఈ బంద్  కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

BC bandh successful across the Mandal

More articles

Latest article