24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ధర్నాలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్రంలో ‘సై’ అంటు.. ఢిల్లీలో ‘నై’ అంటున్న బిజెపి నేతల తీరును ఖండించిన ఆది
  • బిజెపికి వ్యతిరేకంగా ధైర్యం చేయలేకపోతున్న బీఆర్ఎస్
  • బీసీ రిజర్వేషన్ పై మా పోరాటం ఇప్పటితో ఆగదు..!

 

సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేపట్టారు. తెల్లవారుజామున నుంచే బస్సులు బయటకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. వేములవాడలో కొనసాగుతున్న బంద్ పరిస్థితిని స్వయంగా బైక్‌పై వెళ్లి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ప్రధాని మోడీ దగ్గర బీసీ రిజర్వేషన్లపై మాట్లాడలేకపోతున్నారని, రాష్ట్రంలో ‘సై’ అంటున్న బీజేపీ నేతలు డిల్లీలో ‘నై’ అంటున్నారని ప్రశ్నించారు. బీసీ బిడ్డల నోటీకాడికి వచ్చిన బుక్క తీసివేయవద్దని డిమాండ్ చేస్తూ, డిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల నిరసనలకు బీఆర్‌ఎస్ నేతలు మద్దతు ఇవ్వలేకపోయారని విమర్శించారు.బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడేందుకు ధైర్యం చేయలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.ఈ కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, నియోజకవర్గ పార్టీ యూత్ అధ్యక్షులు న్యాత నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగరం వెంకటస్వామి, గూడూరి మధు, పుల్కం రాజు, బింగి మహేష్, కూరగాయల కొమురయ్య, మైలారం రాము, చిలక రమేష్, సిపిఎం పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article