27.5 C
Hyderabad
Friday, July 31, 2026

సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :   బీసీ లకు రాష్ట్రంలో అన్ని రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లో భాగంగా శనివారం  నగరంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ద్వారకానగర్ నుంచి బస్టాండ్ , రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా బీసీలు అత్యధిక జనాభా ఉండి కూడా రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నారని  పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 9 ను స్వాగతిస్తున్నామని,  గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లును ఆమోదించాలని ,  కేంద్ర ప్రభుత్వం బిల్లులను అడ్డుకోవటం సరైంది కాదని విమర్శించారు.   బీసీ లు అందరూ బీజేపీ ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా  ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, సీపీఐ ఎంఎల్ నగర కార్యదర్శి నీలం సాయిబాబా,  ఐఎఫ్టీయూ నగర అధ్యక్ష,  కార్యదర్శులు మల్లికార్జున్, శివకుమార్, నగర కమిటీ సభ్యులు రమేష్, సత్యం, మోహన్, నర్సింగ్ రావు, పీ డీఎస్ యూ నాయకులు జన్నారపు రాజేశ్వర్,మనోజ్,సాయి కిరణ్, ప్రసాద్, రైతు కూలి సంఘం నాయకులు చిన్నయ్య ,ఎర్రన్న,  పీవైఎల్  నాయకులు బండమీద నర్సయ్య, భాస్కర్,మరియు తదితదిరులు పాల్గొన్నారు.


Rally under the auspices of CPI ML New Democracy

More articles

Latest article