27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 18 బిసి రాష్ట్ర బంద్ కు మద్దతుగా బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి పాల్గొంటుదని రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దండి వెంకట్ మాట్లాడుతూ  స్థానిక సంస్థల్లో 42% బిసి రిజర్వేషన్ అమలు చేయడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని బిసి కులాల ప్రజలు బిజెపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు 18 బిసి రాష్ట్ర బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని  9 వ షెడ్యూల్ చేర్చే  భాధ్యత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిదేనని దండి వెంకట్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% బిసి రిజర్వేషన్లను ప్రకటించినప్పుడు అసెంబ్లీలో మద్దతు ప్రకటించిన బిజెపి, బీఆర్ఎస్ పార్టీ లు ఇప్పుడు 9వ జీవో పై హైకోర్టు స్టే ఇవ్వడంతో మాట మార్చి మొత్తం నెపం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నించడం భావ్యం కాదన్నారు. 18 బిసి రాష్ట్ర బంద్ కు ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత, జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, జిల్లా కమిటి సభ్యులు  టి. సంజయ్ , మంగేష్ కాంబ్లె ,నిజామాబాద్ నగర నాయకులు గజానంద్, కె.శీను,ఎం. అనిల్, రేఖా,శాంతాబా, మౌనిక, సమాంత లు పాల్గొన్నారు.

More articles

Latest article