25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నేడు విద్యా సంస్థల బంద్ కు పి డి ఎస్ యూ  పిలుపు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం రేపు జరిగే రాష్ట్ర బందును జయప్రదం చేయాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజాంబాద్ నగరంలో సుభాష్ నగర్ లో  పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.   ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ ఎవరి జనాభా ప్రకారం వారు రిజర్వేషన్లను అనుభవించాలని రాజ్యాంగంలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెం.9 ని హైకోర్టు కొట్టి వేసిందనీ.  రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను  చేర్చి న్యాయబద్ధత చేకూర్చేల చర్యలు తీసుకోవాలని,  బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ కి పి డి ఎస్ యూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది, ఈ బంద్ పిలుపుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, అసెంబ్లీలో తీర్మానానికి మద్దతులిచ్చాయి.  కానీ కేంద్రంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్స్ అమలు చేయించడం కోసం కృషి చేయాలి.కేంద్ర ప్రభుత్వం ఈ న్యాయమైన డిమాండ్ని రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చి, రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం కల్పించాలనీ ,రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినా, రాష్ట్ర గవర్నర్ కానీ,  కేంద్ర ప్రభుత్వం గానీ పట్టించుకోవటం లేదని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ, ప్రజా సంఘాలు బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం జరిగే రాష్ట్ర బంద్ లో పాల్గొనాలని కోరారు. రాజకీయ లబ్ధికోసం, కుట్రలు కుతంత్రాలు మాని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేటట్లు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు, రాజకీయ ,విద్యా ,ఉద్యోగ ,రంగాలలలో కూడా 42 % బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం జరిగే విద్యాసంస్థల బందుకు ప్రైవేట్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు సాయి కిరణ్, ప్రసాద్,ప్రసాద్,శివ ప్రసాద్, విశ్వ వినయ్,సందీప్,మణికంఠ,చరణ్ తేజ్,రాజు,వంశీ, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article