27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

21 నుంచి పోలీస్ సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకోవడంలో భాగంగా  ఈనెల 21 నుంచి 31 వరకు కమిషనరేటు పరిధిలో పోలీస్ సంస్మరణ వారోత్సవాలు ప్రారంభమవుతాయని సీపీ  సాయి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో  తెలిపారు.  నిజామాబాద్ పోలీస్ సిబ్బంది   విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేశారని పేర్కొన్నారు.  ఈనెల 20న రద్దీ గల ప్రదేశాలలో, ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్స్ యందు బ్యానర్స్, హోర్డింగ్స్, పోస్టర్ లు ఏర్పాటు చేస్తామన్నారు. 21న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  అమరవీరుల దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 22న  నిజామాబాద్ డివిజన్ లో  అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తా మన్నారు. 23న విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తా మన్నారు. 24న  ఆర్మూర్, బోధన్ డివిజన్ ల లో అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తామన్నారు. 25న  సైకిల్ ర్యాలీ మరియు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ (డిచ్ పల్లి నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ఉంటుందన్నారు. 26న  వ్యాస రచన పోటీలు నిర్వహిస్తామన్నారు. 27న నిజామాబాద్ డివిజన్ లో కొన్ని కాలనీలలో, కొన్ని గ్రామాలలో ప్రజలకు అవసరాలను గుర్తి స్తామన్నారు. 28న ఆర్మూర్, బోధన్ డివిజన్లలో  కొన్ని కాలనీలలో, కొన్ని గ్రామాలలో ప్రజలకు అవసరాలను గుర్తి స్తామన్నారు.29న  పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు. 30న ఆన్లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 31న గాంధీ చౌక్ నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు క్యాండిల్ ర్యాలీ ఉంటుందన్నారు.  

More articles

Latest article