21 నుంచి పోలీస్ సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం
నిజామాబాద్, బతుకమ్మ : పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకోవడంలో భాగంగా ఈనెల 21 నుంచి 31 వరకు కమిషనరేటు పరిధిలో పోలీస్ సంస్మరణ వారోత్సవాలు ప్రారంభమవుతాయని సీపీ సాయి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేశారని పేర్కొన్నారు. ఈనెల 20న రద్దీ గల ప్రదేశాలలో, ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్స్ యందు బ్యానర్స్, హోర్డింగ్స్, పోస్టర్ లు ఏర్పాటు చేస్తామన్నారు. 21న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అమరవీరుల దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు....