27.4 C
Hyderabad

బస్తీ దవాఖానలో న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి  

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్‌ను డి-అడిక్షన్  హాబిలిటేషన్ సెంటర్‌, బస్తీ ఆసుపత్రి, రాజీవ్ నగర్, సిరిసిల్లలో సోమవారం రోజున ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాధిక జైస్వాల్ మాట్లాడుతూ గౌరవ సభ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ, హైదరాబాద్ ఆదేశాలతో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి .పి.నీరజ మార్గదర్శకత్వంలో జిల్లా వైద్యాధికారి  రజిత  సమన్వయంతో  పోలీస్ సూపరింటెండెంట్  మహేష్ బి గితే  అనుమతితో న్యాయ సహాయ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో లోక్ అదాల సభ్యులు చింతోజు భాస్కర్, మానసిక వైద్య నిపుణులు  ప్రవీణ్,  మెడికల్ ఆఫీసర్ మణి వర్మ, ఈ. స్వాతి, నర్సింగ్ ఆఫీసర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article