ఆలూర్, బతుకమ్మ : ఆలూర్ మండలం దేగాం గ్రామంలోని మఠం గల్లీలో మినీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మినీ శ్రీకాంత్ మాట్లాడుతూ “దసరా పండుగ ముగిసిన తర్వాత అలయ్ బలయ్ వేడుకల ద్వారా గ్రామస్తులంతా ఏకతా భావంతో వేడుకలు నిర్వహిస్తామని, ఈ వేడుకలు ద్వారా మన మధ్య ప్రేమాభిమానాలు, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి అని అన్నారు. దీని దీని ద్వారా కులం, మతం, వర్గం అనే తేడాలు లేకుండా అందరం ఒక్కటై సత్సంబంధాలను కొనసాగిస్తామని అన్నారు. పండుగల అసలు ఉద్దేశం మనుషులను దగ్గర చేయడమే” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.

