హైదరాబాద్, బతుకమ్మ : దసరా కానుకగా జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎంపీ అర్వింద్ కృషితో ఇప్పటికే నిజామాబాద్, బోధన్ లలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు అయ్యాయి. నూతన భవనాలు, నిర్మించి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ఈ సంవత్సరం నవోదయ పాఠశాలలు ఏర్పాటు తో పాటు తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎంపీ అర్వింద్ జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో పలుసార్లు కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఇప్పుడు జగిత్యాలలోనూ కేంద్రీయవిద్యాలయం ఏర్పాటుకు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జిల్లా ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి మచ్చ లేని పాలన అందిస్తూ ఇందూరు పార్లమెంట్ ను తెలంగాణాలోనే నెంబర్ వన్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న అర్వింద్ ధర్మపురి కి ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.
