26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పార్టీలకతీతంగా అభివృద్ధికి కలిసి రావాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

 

బోధన్, బతుకమ్మ : పార్టీలకతీతంగా గ్రామాలలో అభివృద్ధికి అందరూ కలిసి రావాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. సాలూర మండలంలోని జాడి జమాల్పూర్ గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో నవీపేట్ మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. సాలూర విద్యుత్ కేంద్రంలో అధిక లోడ్ కావడంతో జాడి జమాల్పూర్ గ్రామంలో  33/11 కేవీ సబ్ స్టేషన్ మండల్ విద్యుత్ ఉపకేంద్రం ఆవశ్యకతను గుర్తించి మంజూరు చేయించడం జరిగిందన్నారు. రూ. 2.23కోట్ల వ్యయంతో మంజూరు చేశామన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 యూనిట్లు గృహ విద్యుత్తుకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో ఆచంపల్లి బోధన్ పట్టణం మంజూరు చేయడం జరిగిందన్నారు.  కొత్తగా నిర్మించబోయే విద్యుత్ ఉపకేంద్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.  ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాహెర్ బీన్ అమ్దాన్ రాష్ట్ర చైర్మన్ ఉర్దూ అకాడమీ, నిజాంబాద్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి , డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, ఎస్ ఇ రాపల్లి రవీందర్, డి ఈ బోధన్ మమ్మద్ ముక్తార్, ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ ఏడిఈ, నగేష్ కుమార్, ఏఈ కళ్యాణ్ , కన్స్ట్రక్షన్ వినోద్, ఏఈ శ్రీమతి సుమిత,  ఎమ్మార్వో, గ్రామ పెద్ద సుందర్ రాజ్ నాగేశ్వరరావు గంగా శంకర్ రిటైర్డ్ హెచ్ఎం శంకర్ ఎండిఓ ,వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు,  గ్రామస్తులు విద్యుత్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article