24.8 C
Hyderabad
Friday, July 31, 2026

తక్షణమే సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ అందజేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 6 నుండి నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లో పాల్గొన్న ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ అభ్యర్థులు, హెచ్ఎంలు, నాన్ టీచింగ్ స్టాఫ్ లు మూడు వారాలపాటు ఇంటింటి సర్వే చేపట్టి ఈ ప్రక్రియ పూర్తి చేసి దాదాపు 11 నెలలు పూర్తి కావస్తున్న ఇంతవరకు ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు రెమ్యూనరేషన్ అందజేయలేదు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిరాశ గానే మిగిల్చింది. క్షేత్రస్థాయిలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో 56 అంశాలతో రూపొందించిన నివేదికలో సమాచారాన్ని అందజేసినప్పటికీ దాదాపు 11 నెలలు పూర్తయిన వారికి డబ్బులు చెల్లించడంలో జాప్యం జరుగుతుంది. ఎన్యుమరేటర్లకు కేటాయించిన బ్లాక్ ప్రకారం 150 నుంచి 200 ఇళ్ల వరకు పూర్తి చేస్తే ఒక్కొక్కరికి రూపాయలు 10000, ఒక్కో కుటుంబా వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే రూపాయలు 15 నుంచి రూపాయలు 30 వరకు చొప్పున చెల్లించనున్నట్లుగా అప్పట్లో అధికార వర్గాలు అన్నాయి. కావున ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా తక్షణమే సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ అందజేయాలని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.

More articles

Latest article