28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్, అంబం(ఆర్) గ్రామాలల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని కూడలిల వద్ద బతుకమ్మలను ఒకే చోట పెట్టి బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం గ్రామ శివారులోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article