బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి పూజలు చేశారు.అనంతరం బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడి పాడారు. బాన్సువాడలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే,జాజల సురేందర్,బాజిరెడ్డి గోవర్ధన్,గంపగోవర్దన్,జిల్లా అధ్యక్షుడు ముజీభోద్దీన్, నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ జుబేర్,సీనియర్ నాయకులు నార్ల రత్నకుమార్,మాజీ రైతు బందు సమన్వయ సమితి దుద్దాలా అంజిరెడ్డి,మోచి గణేష్,ఎర్రవట్టి సాయిబాబా,యువ నాయకులు శివసూరి,కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
