నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్2 వరకు తిరుపతిలో నిర్వహించే ఎన్.సి.సి.జాతీయ స్థాయి ఏపీ ట్రెక్కింగ్ -I క్యాంప్’లో నిజామాబాద్ గ్రూప్ నుండి 51 మంది ఎన్.సి.సి. క్యాడెట్స్ పాల్గొంటున్నారు. దీనిలో ఎన్.సి.సి.12 తెలంగాణ బెటాలియన్ నిజామాబాద్ నుండి 08 ఎస్.డి. 06 జె.డి.క్యాడెట్స్ తో పాటు, ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం రామస్వామి పాల్గొంటున్నారని, కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ తెలియజేశారు. ఈ సందర్భంగా కమాండింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ట్రెక్కింగ్, అడ్వెంచర్ వంటి జాతీయ క్యాంపులు వివిధ ప్రాంతాలలో చేయడం వల్ల క్యాడెట్స్ లో జాతీయత భావం పెరుగుతుంది.ప్రకృతిని, పరిస్థితులను అర్థం చేసుకుంటారు.ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు.క్యాడెట్స్’ను సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో జె.సి.వో.లు, ఎన్.సి. వో.లు మంచి శిక్షణను అందిస్తున్నారని అభినందించారు. ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ. ఇటువంటి నేషనల్ క్యాంప్స్ వల్ల ఎన్.సి.సి. విద్యార్థులకు శారీరక, మానసిక ధృడత్వం కలుగుతుంది.కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం, పట్టుదల ఆత్మవిశ్వాసం,జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలతో పాటు, ప్రకృతితో మమేకమవ్వడంతో పర్యావరణ పరిరక్షణపై క్యాడెట్స్ కు చక్కటి అవగాహన పెరుగుతుందన్నారు. ఎన్సిసి కార్యాలయ ఉద్యోగులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, పాఠశాలల, ఉపాధ్యాయులు ఎన్.సి.సి. విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
