29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కుమారుడి రిసెప్షన్ ఖర్చును రైతుల కోసం ఇచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.  2 కోట్ల చెక్ అందజేశారు. రూ. 2 కోట్లను తన నియోజకవర్గం లోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు.  లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితం గా అందజేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన లక్ష్మారెడ్డి అందు కోసం రెండు కోట్లు ఖర్చుచేయాలనుకున్నారు. రిసెప్షన్ ను రద్దు చేసుకొని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆ డబ్బులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి అందించారు. ఎమ్మెల్యే నిర్ణయాన్ని సీఎం అభినందించారు. కాగా,  యూరియా విషయంలో బత్తుల లక్ష్మారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన గన్ మన్  ఓ లారీ యూరియాను అక్రమంగా తరలిస్తూ దొరికిపోయారు. ఈ అంశంపై దుమారం రేగింది. ఇప్పుడు ఆయన ఇలా ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తా ఇవ్వాలని రూ. 2 కోట్లు విరాళం అందించడం మిర్యాలగూడ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

More articles

Latest article