కుమారుడి రిసెప్షన్ ఖర్చును రైతుల కోసం ఇచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.  2 కోట్ల చెక్ అందజేశారు. రూ. 2 కోట్లను తన నియోజకవర్గం లోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు.  లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితం గా అందజేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన లక్ష్మారెడ్డి అందు కోసం రెండు కోట్లు ఖర్చుచేయాలనుకున్నారు....