నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సాయుధ రైతాంగ సభను సీపీఐ (ఎం) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నాందేవ్ వాడ కార్యాలయం లో నగర కార్యదర్శి సుజాత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డీ నూర్జహాన్ మాట్లాడుతూ..ఆనాటి సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులే ప్రజల మాన ప్రాణాలు కాపాడారని, సాయుధ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూమిని పంచించారని, నిజాం నవాబు అండదండలతో రజాకార్లు, దేశముఖ్, పటేల్,పట్వారీ, దొరలే ప్రజలను వేధించారని, వీరంతా ఆనాటి నిజాంకు తొత్తులుగా ఉన్నారని ప్రజల తరుపున నిజాయితీగా పోరాటాలు నిర్వహించేది కమ్యూనిస్టులేని తెలిపారు. నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ నేడు బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు చరిత్రను వక్రభాష్యం చెపుతూ హిందూ – ముస్లిం పేరుతో రాజకీయాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆనాటి రాజు ముస్లిం అయినప్పటికీ దేశముఖ్,పటేల్, పట్వారీలు, దొరలు ఏ మతస్తులని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైన రాజకీయాలు మాని, ప్రజా సమస్యలు పరిష్కారం చేయటానికి కృషి చేయాలని ఆమె కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశానికి అంటుకుంటే విద్యా వైద్యం ఉద్యోగం మహిళలపై హత్యలు హత్యాచారాలు పెరుగుతుంటే మాట్లాడకుండా దేశ భక్తి పేరుతో హిందూ ముస్లిం పేరుతో దేశాన్ని విభజించేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వివరించారు. రాజ్యాంగాన్ని మార్చి దళితుల,గిరిజన హక్కులను కాళ్ళరాస్తుందని ఆమె ఆరోపించారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్పూర్తితో మరో పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య, నగర్ శాఖ సభ్యులు యశోద, రజియా, లక్ష్మీ బాయ్, సంగీత, పంచ పూల దీక్షిత, శాఖ 80 క్వార్టర్స్ శాఖ సభ్యులు రేఖ, జ్యోతి, విమల, భాయ్, సోనీ, అనిత తదితరులు పాల్గొన్నారు.
