26.3 C
Hyderabad
Monday, August 3, 2026

హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం చరిత్రాత్మకం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత దేశం బ్రిటిష్ వలస పాలకుల నుండి స్వాతంత్ర్యo పొందిన అనంతరం భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్తానం విలీనం కావడం చారిత్రాత్మాకమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి అన్నారు. తెలంగాణ సంస్తానం భారత యూనియన్ లో కలిసిపోయి, నిజామ్ సర్దార్ పటేల్ ముందు లొంగిపోయిన సెప్టెంబర్ 17 పర్వదినం సందర్బంగా జిల్లాకోర్టు చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం ఆయన మాట్లాడారు.హైదరాబాద్ సంస్తానం నిజాం పాలన నుండి భారత్ పాలనలోకి రావడానికి నాటి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనే భారీ సైనిక చర్యను చేపట్టి నిజాం ఆఖరికి నాటి హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభయ్ పటేల్ ముందు లొంగిపోయారని తెలిపారు. రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు విరోచిత పోరాటం చేశారని ఆయన అన్నారు.నిజామ్ పాలన కాలంలో నిజామ్ రాజుకు, దొరలు, పటేల్ లకు వ్యతిరేకంగా కూడా తెలంగాణ ప్రజలు రాజిలేని ఉద్యమం చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శనంగా నిలిచారని సాయరెడ్డి వివరించారు. రజాకార్ల అకృత్యాలను ఎదిరించడంలో నిజామాబాద్ జిల్లాలో ఎందరో త్యాగధనుల త్యాగాలు ఉన్నాయని అన్నారు. నిజామాబాద్ ఓల్డ్ జైలు లో నిజామ్ కు వ్యతిరేకంగా పోరాడిన వారిని బందించిన బందిఖానగా చరిత్ర పుటలలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట అల్వారు స్వామీ, నిజామాబాద్ కు చెందిన నల్ల నరసింహ రెడ్డి, మాణిక్ రెడ్డి, ఆర్య సమాజం కీలక భూమిక పోషించాయని ఆయన అన్నారు. హైదరాబాద్ సంస్తానం నిజామ్ ఎలుబడి నుండి భారత్ యూనియన్ ఎలుబడిలోకి రావడంలో భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు తో పాటు హోమ్ శాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ల రాజనీతిజ్ఞతను ప్రపంచ దేశాలు కొనియాడయని సాయరెడ్డి విశ్లేషంచారు. కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు,ఉపాధ్యక్షుడు దిలీప్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ అమిదాల సుదర్శన్, సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, జక్కుల వెంకటేశ్వర్,ఆశా నారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article