25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బ్యాగ్ తో తలపై కొట్టిన టీచర్.. చిట్లి పోయిన బాలిక పుర్రె ఎముక

Must read

📰 Generate e-Paper Clip

చిత్తూరు, బతుకమ్మ : తరగతి విద్యార్థిని అల్లరి చేస్తుందని ఉపాధ్యాయుడు తలపై బ్యాగ్ తో కొట్టాడు. ఈఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు భాష్యం స్కూల్లో చోటు చేసుకోగా,  ఆలస్యంగా   వెలుగులోకి వచ్చింది. ఈనెల 10న భాష్యం స్కూల్లో ఆరో తరగతి విద్యార్థిని సాత్విక నాగశ్రీ (11) తలపై  ఉపాధ్యాయుడు సలీం భాష బ్యాగ్ తో కొట్టాడు. అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పని చేస్తున్నా..మాములుగా కొట్టాడనుకొని పట్టించుకోలేదు. తలనొప్పితో బాలిక మూడు రోజులు స్కూల్ కు  వెళ్లలేదు. దీంతో పుంగనూరులో ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి బెంగళూరు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో బాలికను చూపించగా  ఆమె పుర్రె ఎముక చిట్లి పోయినట్లు పరీక్షల్లో తేలింది. బాలికకు ఇది తీవ్ర సమస్యగా మారింది. సోమవారం రాత్రి స్కూల్ యజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

More articles

Latest article