రూ. 200 వివాదంలో తేజస్వీ యాదవ్ 

0 4,140

వెబ్ న్యూస్, బతుకమ్మ : బీహార్ లో మరికొన్ని రోజల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆర్జేజీ నేత తేజస్వీ యాదవ్ మోసం చేసి రూ.200 తీసుకున్నారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈసరికొత్త వివాదంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సింగ్వారాకు చెందిన గుడియా దేవి అనే మహిళ  ఈ ఫిర్యాదు చేయగా అందులోని వివరాల ప్రకారం.. మై బెహన్ యోజన కింద మహిళలకు రూ.2,500 హామీ పథకం కోసం దరఖాస్తు చేయిస్తామని తన వద్ద నుంచి రూ.200 తీసుకున్నారని ఆరోపించింది. ఇందుకు సంబంధించి పలువురు మహిళల నుంచి ఆధార్, మెబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నట్లు తెలిపింది. ఈక్రమంలో తేజస్వీయాదవ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ సహా పలువురిపై ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.