24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సాయుధ పోరాట విలీన దినోత్సవాన్ని ఆదివారం సిపిఐ నగర్ కార్యదర్శి వై.ఓమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ  రైతాంగ పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుతున్నామన్నారు. 77వ తెలంగాణ సాయుధ రైతాంగ  పోరాట వారోత్సవాల సందర్భంగా ఈనెల 11 నుండి 16 వరకు గ్రామ, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి, సభలు నిర్వహిస్తూ తెలంగాణ సాయిధ రైతంగ పోరాట విలీన దినోత్సవ చరిత్రను ప్రజలకు వివరించాలని సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ప్రజలకు వివరించాలని కోరారు. నాడు నైజాంకు వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి,మాక్ధూమ్ మహినుద్దీన్, ఆరుట్ల కమల రామచంద్రారెడ్డి, బొమ్మ గాని ధర్మభిక్షం, రాజ్ బహుదూర్ గౌర్ ,దొడ్డి కొమురయ్య, షేక్ బందగి, చాకలి ఐలమ్మలు భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం విరోచిత పోరాటాలు చేశారని 4500ల మంది కమ్యూనిస్టుల ప్రాణ త్యాగంతోటే తెలంగాణ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని,  3500 గ్రామాలు వేట్టి చాకిరి నుండి విముక్తి పొందాలని అన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న నిజాంనవాబ్ భారత్ లో విలీనం చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం బిజెపి సాయిధ పోరాట చరిత్రను హిందు- ముస్లిం పోరాటంగా వక్రీకరిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ సాయుధ రైతంగ పోరాట విలీన దినోత్సవంను అధికారికంగా జరపడంతో పాటు ఇట్టి చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు బి.రఘురాం, రంజిత్, నగర నాయకులు సక్కి. సురేష్, అనిల్, దేవేందర్, సాయమ్మ గంగామణి, ఫిరోజ్, భాను, శుభోదు, కుశాల్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article