28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం వేల్పూర్, భీమ్ గల్ మండలాలోన్ని పలువురు ఆత్మీయ భాదిత కుటుంబాలను పరామర్శించారు. ఇందులో భాగంగా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన బబ్బురి రమేష్ వాళ్ళ నాన్న నడ్పి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా l వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. పచ్చలనడుకుడ గ్రామానికి చెందిన పున్నంరెడ్డి వాళ్ళ నాన్న అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా  వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే పచ్చలనడుకుడ గ్రామానికి చెందిన టిప్ టాప్ గంగారెడ్డి కి ఇటీవల ప్రమాదవశాత్తు చేయు విరుగగా ఆయనను పరామర్శించి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. అనంతరం భీమ్ గల్ మండలంలోని బడా భీంగల్ గ్రామానికి చెందిన రాగుల లింబాద్రి  ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకోగా ఆయన్ని పరామర్శించి ఆరోగ్య పరుస్థితిని అడిగి తెల్సుకొన్నారు. మండలంలోని పెద్దమ్మ కాడి తండాకు చెందిన లింబన్న భార్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఆయన వేల్పూర్, భీమ్ గల్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mutyala visited the families of the victims.

More articles

Latest article