27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ముత్యాల చెరువుతో మా గ్రామానికి ముప్పు

Must read

📰 Generate e-Paper Clip

  • రోడ్డు పై బైఠాయించిన వాడి గ్రామస్తులు
  • ముత్యాల చెరువు కట్టేందుకు సర్వే కోసం వచ్చారని ఆందోళన
  • అలాంటి సర్వే ఏమి లేదని పోలీసుల వివరణ

Our village is threatened by the Pearl Pond

ధర్పల్లి, బతుకమ్మ : ముత్యాల చెరువుతో తమ గ్రామానికి ముప్పు ఉందని ధర్పల్లి మండలంలోని వాడి గ్రామస్తులు నిరసనకు దిగారు. గత వారం కురిసిన వర్షాల వల్ల ముత్యాల చెరువు తెగిపోయి తమ గ్రామానికి నష్టం వాటిల్లిందని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ముత్యాల చెరువు తెగి పోయి ఇల్లు, వాకిలి ఏమి మిగలకుండా ఆస్తి నష్టం, పంట నష్ట పోయి ప్రాణాలు చేతబట్టుకొని అన్నమో రామచంద్రా అంటూ ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ ముత్యాల చెరువు కట్టేందుకు అధికారులు చూడటం సరికాదని, సర్వే నిర్వహించడం ఏంటని వాడి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  హోన్నాజీ పెట్, నడిమి తండా శివారులో ఉన్న ముత్యాల చెరువు కట్టాలని అక్కడి స్థానికులు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నారని, ఈ విషయమై రీ డిజైన్, సర్వే చేయడానికి, అక్కడ చెరువు కట్ట తెగిపోయిన చోట మళ్లీ మరమ్మత్తులు చేయడం కోసం అధికారులు వచ్చారన్న సమాచారం తెలుసుకొని వాడి గ్రామస్తులు అధికారుల వద్దకు వెళ్లి తమ గోడును విన్నవించుకునేందుకు శుక్రవారం  ట్రాక్టర్ లలో మహిళలు, పురుషులు, పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు. ధర్పల్లి ఎస్ ఐ కళ్యాణి, పోలీస్ సిబ్బంది వారిని బస్ స్టాండ్ వద్ద అడ్డగించి అధికారుల వద్దకు వెళ్లకుండా నిలిపివేశారు. ముత్యాల చెరువు మరమ్మత్తుల కోసం ఏ అధికారి రాలేదని, అక్కడ చెరువు కట్టడానికి అనువైన స్థలం కాదని,  సరిపోదని అధికారులు వచ్చింది ఎలా జరిగింది తెలుకోవడం కోసమే అని నిరసన నిలిపివేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించబోదని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కూడా విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులకు తెలిపినట్లు సమాచారం. ఒకవేళ అక్కడ మళ్లీ చెరువు నిర్మిస్తే మా ప్రాణాలతో చెలగాటమాడినట్లేనని, మా వాడి గ్రామం తో పాటు కింద ఉన్న కొండూరు, వాల్గొట్, చిన్నవాల్గాట్, భీంగల్ కు ముప్పు వాటిల్ని అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ముత్యాల చెరువు మరమ్మత్తులు చేయవద్దని వేడుకుంటున్నామన్నారు. ముత్యాల వాగు వల్ల హోన్నాజీ పేట్, వాడి, మద్దుల్ తండాలకు ఎలాంటి ప్రయోజనం లేదని, నష్టం వాటిల్లి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్యాల చెరువుతో వరదలు వచ్చి వాడి గ్రామాన్ని అతలాకుతలం చేసిన ఈ రిజర్వాయర్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాల్సిందే? కాగ ఈ నిరసంతో రోడ్డు పై రాక పోకలు నిలిచి పోయాయి. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు కూడా వాడి గ్రామస్తులకు సపోర్ట్ గా నిలవడం విశేషం సంతరించుకుంది.

Our village is threatened by the Pearl Pond

More articles

Latest article