నవీపేట్, బతుకమ్మ : నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో బ్రదర్స్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసినా గణపయ్యకు బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ మగ్గరి హన్మండ్లు మట్లాడుతు నాళేశ్వర్ గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు పుష్కలంగా పండాలని,ఆ గణపయ్య ఆశిస్సులు నాళేశ్వర్ ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని ఆ గణనాథుడికి కుటుంబ సమేతంగా పూజలు చేసి మొక్కుకోవడం జరిగిందని తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా నాళేశ్వర్ గ్రామంలోని కోందరు యువకులు ఆన్నదమ్మల్లగా కలిసి మేలిసి ఉంటూ బ్రదర్స్ యూత్ గా ఎర్పడి గణపయ్యను కోలువుదిర్చడం జరుగుతుంది, ఆంతేకాకుండా ఒక్కో సంవత్సరం ఓకలా గణపయ్యను కోలువు దిరుచుతు తమ వంతు గా సమాజానికి తామ యూత్ తరుపునా ఓక గణపయ్య రూపంలో సందేశాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రదర్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

