మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో తిమ్మాపూర్ గ్రామానికి నాలుగు లక్షల పై చిలుకు నిధులతో మరుగుదొడ్ల మంజూరు చేయడం జరిగినది మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. తిమ్మాపూర్ గ్రామాభివృద్ధి పథంలో ఉండడానికి ఎంతో కృషి చేస్తున్నారని గ్రామస్తులు, గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో సంతోషంతో నాయకులకు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ కమిటీ తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ నరసయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, బద్దం రాజశేఖర్, మారుడి సురేష్, రొక్కం మురళి, కిష్టా గౌడ్, పెండ్యాల అశోక్, తరతం అశోక్, యూత్ అధ్యక్షులు కొలిపెక సాయి, గుర్రం అనిల్, కొమ్ముల వెంకటేష్, గంగారెడ్డి, గోపి, దేవేందర్,కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
