26.2 C
Hyderabad
Monday, August 3, 2026

స్కూల్ స్థలాన్ని కబ్జాల నుంచి కాపాడాలని కలెక్టర్ కు ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాలూరు జెడ్.పి.హెచ్.ఎస్ స్కూలు స్థలాన్ని కబ్జానుంచి కాపాడాలని నివారించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలూరు జెడ్ పి హెచ్ ఎస్ స్థలాన్ని కబ్జాల నుండి కాపాడాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ముస్కె సంతోష్ అనే వ్యక్తి జెడ్పిహెచ్ఎస్ కాలూర్ స్కూలు స్థలాన్ని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణానికి పాల్పడుతున్నాడన్నారు. గతంలోనూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అడ్డుకొని, సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన స్కూలు స్థలాన్ని కాపాడారన్నారు. ప్రస్తుతం మళ్ళీ స్కూలు స్థలం కబ్జాలకు గురవుతుందన్నారు.  గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు కబ్జాదారుడికే వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. స్కూలు స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని, పాఠశాల స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.  ఫిర్యాదు చేసిన వారిలో మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు ఎగ్గడి నారాయణ, మాధస్తు ప్రవీణ్, కోర్వ దశరథ్, సిర్నం నారాయణ, పడిగల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article