29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణలో ఏసీబీ దూకుడు

Must read

📰 Generate e-Paper Clip

  • 8 నెలల్లో 179 కేసులు
  • 167 మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత
  • రూ.44 కోట్ల ఆస్తుల సీజ్

 

హైదరాబాద్, బతుకమ్మ : అవినీతి నిరోదక శాఖ తెలంగాణలో దూకుడు పెంచింది. ఏసీబీ చరిత్రలోనే ఈ యేడాది అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఏసీబీ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఆగస్టు మాసంలోనే 31 ఏసీబీ కేసులు నమోదు చేసి 22 మంది ప్రభుత్వ, 4 ప్రైవేట్ ఉద్యోగులను అరెస్టు చేయడమే అందుకు నిదర్శనంగా చెప్పాలి. గత 8 నెలల కాలంలో ఏసీబీ 179 కేసులను నమోదు చేసి, 167 మందిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. జనవరి నుంచి ఆగస్టు వరకు 44.30 కోట్ల విలువైన అక్రమాస్తులను సీజ్ చేసింది. తెలంగాణలో తొలిసారి నీటి పారుదల శాఖకు చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్ సీ) ఏసీబీకి చిక్కడంతో కోట్ల కొలది అక్రమాస్తులు బయటపడ్డాయి. ఈసారి ఏసీబీ కేసుల్లో అత్యధికంగా రెవెన్యూ, ఆర్టీఏ, ఎక్సైజ్, విద్యుత్, పంచాయితీరాజ్, మున్సిపల్ అధికారులే అధికంగా ఉన్నారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో గుబులు పట్టుకుంది. ఏసీబీ ఎప్పుడు ఎవరిని పట్టుకుంటుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అవినీతి అధికారుల విషయంలో రాజీ పడేది లేదని టోల్ ఫ్రీ నంబర్ కు  ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరుతుంది. ఇప్పటికే ప్రచారాన్ని పెంచింది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పోస్టర్లను అతికించి సామాన్యులకు ఏసీబీ చేరువయ్యే ప్రయత్నాలు  చేస్తోంది.

More articles

Latest article