నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోడల్ స్కూల్ లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులు వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో సోమవారం నుంచి సామూహిక సెలవు పెట్టారు. మోడల్ స్కూల్ లలో కంప్యూటర్ ఆపరేటర్, వాచ్మెన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఆఫీస్ సబార్డినేట్, ఇతర పోస్టులు పనిచేస్తున్న వారి వేతనాలు ఆరు నెలలుగా అందడం లేదని వాపోయారు. సెప్టెంబర్ 1 నుంచి సామూహిక సెలవు పెట్టి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిరసన తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ వినతిపత్రం సమర్పించారు. గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను కనీస ఉద్యోగులుగా గుర్తించడం లేదని వాపోయారు. వేతనాల కోసం అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన స్పందించకపోవడంతోని సామూహిక సెలవు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
