27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

– మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బతుకమ్మ, నవీపేట్ : సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తుందని, దానిలో భాగంగానే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేసి డీఎస్సీ 2024 నిర్వహించామని, మరికొన్ని రోజుల్లో నూతన ఉపాధ్యాయులు రానున్నారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండలం లోని బినోల ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రేపటి భవిష్యత్తు ను తీర్చిదిద్దే ఉపాధ్యాయులతో తల్లితండ్రులు మర్యాదగా వ్యవహరించాలని, పిల్లలను బోధించే క్రమంలో దండించిన ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తించొద్దని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తల్లితండ్రులకు సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్టం అవసరమైన తాగునీరు, మూత్రశాలల నిర్మాణం, నూతన గదుల నిర్మాణం తదితర మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తామని తెలిపారు.

విద్యార్థినికి రూ.5 వేల ప్రోత్సాహక బహుమతి..

సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శివ తాండవ నృత్యం చేసిన నాలేశ్వర్ ఉన్నత పాఠశాలకు చెందిన 9 వ తరగతి విద్యార్థిని సంజన కు ఎమ్మెల్యే 5 వేలు అందజేశారు. త్రిశూలం పట్టి శివ తాండవం చేసినట్లు సమాజంలో గల చెడు ను చీల్చి చెండాలని కోరుతూ 5 వేలు ఇచ్చినట్లు ఆడపిల్లలు దైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హుందాన్, డీఈవో దుర్గా ప్రసాద్, ఎంపీడీఓ నాగనాథ్, ఎంఇఓ గణేష్ రావు,
స్కూల్ హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి, పిఆర్టియు మండల అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి శివ కుమార్, వివిధ పాఠశాలల ప్రదానోపాధ్యాయులు, పీఈటి లు, పి.డి. లు, అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article