30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కనిపించకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

  • చంపి ముల్లెకట్టి కెనాల్ పై పడేసిన దుండగులు
  • సుంకేట్ పోతు నరేందర్ గా గుర్తించిన పోలీసులు

 

ఆర్మూర్, బతుకమ్మ : గత నాలుగైదు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి ఆదివారం దారుణ హత్యకు గురై కెనాల్ పైన ముల్లె కట్టి పడేసిన ఘటన ఆర్మూర్ పట్టణంలో జరిగింది. సంఘటన వివరాల్లోకి వెళ్తే ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన పోతు నరేందర్ (65)అనే వ్యక్తి ఈ నెల 20 నుండి ఇంట్లో నుండి ఊరికి వెళ్ళొస్తానని వెళ్లి తిరిగి రాలేదు. దాంతో బంధువులు, కుటుంబీకులు ఎంత గాలించిన ఆచూకీ తెలియకపోగా స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లు తెలిసింది. అయితే ఆదివారం సాయంత్రం ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ పై ఒకరిని హత్య చేసి ముల్లె కట్టి పారావేసి వెళ్లినట్లు ఆర్మూర్ పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలం వద్దకు వెళ్లిన పోలీసులు మృతుడు వేసుకొన్న బట్టలు, ఆయన ముఖాన్ని చూసి మిస్సింగ్ కేసు ఆధారంగా నరేందర్ గా గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్ మోర్తాడ్ కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మృతుడు నరేందర్ ను ఆర్మూర్ లో ఎక్కడో హత్య చేసి కెనాల్ పై పారేసి ఉంటారని, ముల్లె కట్టిన మృత దేహాన్ని బైక్ పై వచ్చిన వ్యక్తులు పారేసి వెళ్లినట్లు సీ సీ కెమెరాల ఆధారంగా ఆర్మూర్ పోలీసులు గుర్తించినట్లు తెలిసిసింది. దాని ఆధారంగా కేసు నమోదు చేసుకొని, నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

More articles

Latest article