ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి అంబేద్కర్ చౌరస్తా నుండి బంజారా సోదర సోదరీమణులు సోదరులు, సోదరీమణులు తీజ్ పండగలో భాగంగా బతుకమ్మలతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో బంజారా లు సంవత్సరానికి ఒకసారి జరుపుకునే తీజ్ పండగలో తమకు కేటాయించిన 787 సర్వే నెంబర్లో తమని తీజ్ పండగ జరుపుకోకుండా అధికార యంత్రాంగం,పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. అనంతరం బంజారా జిల్లా నాయకులు రాజు నాయక్ మాట్లాడుతూ బంజారాల పట్ల చిన్న చూపు చూడడం సరైనది కాదని అన్నారు.బంజారాల జరుపుకుంటున్న పండుగ పట్ల ఇలాగే అణిచివేస్తే రాష్ట్రవ్యాప్తంగా తమ నిరాసనలను రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా, మండలాల వారీగా ఉదృతం చేస్తామని వారు మండిపడ్డారు,ఇకనైనా ప్రభుత్వం స్పందించి తీజ్ పండగను రాష్ట్ర పండుగ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు దీనికి స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారు ఈ సందర్భంగా కోరారు. బంజారాలకు పండగలను జరుపుకునే స్వేచ్ఛని ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా బంజారాల సదర్ నాయక్ రాజు నాయక్ మండల ప్రెసిడెంట్ అధ్యక్షులు తుకారం నాయక్ ఉపాధ్యక్షులు బాదాబత్ వసంత్ రావు నాయక్ ఉత్సవాల ఉపాధ్యక్షులు వెంగళరావు నాయక్ తేజ్ చైర్మన్ నారాయణ బాబురావు మోతిలాల్ నాయక్ సతీష్ నాయక్సీను నాయక్ మైపాల్ శీను నాయక్ శీను నాయక్ దేవినాయక్ మొజిరం నాయక్ బంజారా సోదరులు మహిళా ఆడపడుచులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని తీజ్ పండగ ర్యాలీని విజయవంతం చేశారు.

