29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆదివారం ఆటవిడుపుగా..

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: ఆదివారం సెలవు రోజు కావడంతో ఆటవిడుపుగా ప్రాజెక్టు అందాలని తిలకించడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. ప్రాజెక్టు జల దృశ్యాలను, గోదావరి పరవాళ్ళు, ప్రాజెక్టు అందాలను తిలకిస్తూ చరవాణిలో సెల్ఫీలు దిగుతూ సంతోషంగా సేద తీరారు. స్థానిక నిజామాబాద్ జిల్లా ప్రజలే కాకుండా నిర్మల్, అదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి పర్యాటకులు రావడం జరిగింది.

  • 8 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 54187క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి 24640 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల కొనసాగుతుంది. కాకతీయ ద్వారా 3500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4500 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 150 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టిఎంసిలు కాగా ఆదివారం సాయంత్రం 1090.90 అడుగులు, 80.053 నీరు నిల్వ ఉంది.

More articles

Latest article