నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సేయింట్ గ్జేవియర్ పాఠశాలలో విద్యార్థి విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పోక్సో యాక్ట్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది రజిత, షి – టీమ్ ఆఫీసర్ హరిత రాణి, నాగరాజు, గైనకాలజిస్ట్ డాక్టర్ మల్లీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లీశ్వరి విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, యుక్త వయస్సులో అమ్మాయిలకు వొచ్చే సమస్యల గురించి వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరించారు. యువ న్యాయవాది రజిత పోక్సో యాక్ట్ గురించి వివరించి విద్యార్థులు సమాజంలో జరుగుతున్న అమానవీయ విషయాలకు దూరంగా ఉండాలని వయస్సు రీత్యా వస్తున్న మార్పులను అర్ధం చేసుకోవాలని 18 సంవత్సరాల లోపు విద్యార్థి విద్యార్థినులు తప్పటడుగులు వేస్తే పోక్సో యాక్ట్ వల్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. షి- టీమ్ ఆఫీసర్ హరిత రాణి మాట్లాడుతూ అమ్మాయిలు తమకు పోకిరీల నుండి పొంచి ఉన్న ముప్పును పసిగట్టి షి టీమ్ సహాయంతో వారి ఆట కట్టించవొచ్చు అను అలాగే సోషల్ మీడియాలో నుండి పొంచి ఉన్న ముప్పును అబ్బాయిల నుండి వస్తున్న ప్రలోభాలను ధైర్యంగా ఎదురుకోవాలని సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని తెలిపారు.అమ్మాయిలకు షి టీమ్ అండగా ఉంటుందని ఈవ్ టీజింగ్ ద్వారా ఇబ్బందులు ఎదురైతే తమను ధైర్యంగా సంప్రదించాలని బాధితురాలు వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ రామ్, రాష్ట్ర కార్యదర్శి అనిరుధ్ రాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరికి చట్టాలపై, సెక్సువల్ గా తమపై జరిగే దాడులను ఎదుర్కోవడానికి చైతన్య వాతమైన సమాజాన్ని నిర్మించడానికి ఈ వేదికను ఉపయోగించి ముందుకు వెళ్తామని ఇక నుండి ప్రతి శనివారం ఒక్కో పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వినయ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

