24.3 C
Hyderabad

బామ్ సేఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • బివియం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లి రవితేజ

 

కామారెడ్డి, బతుకమ్మ :  ఈ నెల 31 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న బామ్ సేఫ్, రాష్ట్రీయ మూల్ నివాసి  సంఘ్ 12వ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ నలుమూలల  నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తరలి రావాలిని బివియం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లి రవితేజ, బివియం రాష్ట్ర కార్యదర్శి విఠల్  కోరారు. తిప్పాపూర్ గ్రామంలో బాంసెఫ్ మహసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు రవితేజ, విఠల్, ప్రభాకర్ మాట్లాడుతూ ఈ దేశంలోని అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి సంఘం బామ్ సేఫ్  అన్నారు.ఓబీసీ కుల జనగణన జరపాలని , ఈవీఎం మిషన్లను తొలగించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఇలా అనేక సమస్యల పైన నిరంతరం పోరాడుతూ బహుజన సమాజాన్ని చైతన్యం చేస్తూ పూలే ,అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్న సంఘం బామ్ సేఫ్ అన్నారు. బాంసెఫ్ రాష్ట్ర మహాసభలకు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో భారతీయ యువ మోర్చా జిల్లా కన్వీనర్  ప్రభాకర్ గారు భారత్ ముక్తి మోర్చా జిల్లా కన్వీనర్ గడ్డం రవి భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా కన్వీనర్ యశ్వంత్ తిప్పాపూర్ గ్రామ నాయకులు గణేష్, సురేష్, ప్రవీణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article