29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సీజ్ చేసిన ఇసుక అక్రమంగా తరలింపు

Must read

📰 Generate e-Paper Clip

  • ఇస్టారీతిన  వ్యవహరిస్తున్నతహసిల్దార్

 

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామ శివారులోని ఓ డైరీ ఫామ్ లో అక్రమంగా ఇసుక డంపులు వేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ తారాబాయి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేసి తహసీల్దార్ కార్యలయానికి తరలించారు. కాగా ఈ ఇసుక డంపులను పత్రిక ప్రకటన పరంగా వేలం పాట నిర్వహించవలసి ఉండగా, అవేమీ పట్టనట్టుగా తహసీల్దార్ తమ ఇష్టారీతిన  వ్యవహరిస్తూ ఎటువంటి వేలం పాట వేయకుండా, ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక డంపులను అక్రమంగా తరలించడం ఎంతవరకు సమంజసమని పలు ప్రశ్నించుకుంటున్నారు.

 

Illegal movement of seized sand

More articles

Latest article