28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బంజారాలను అరెస్టు చేయడం సమంజసం కాదు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే కృషితోనే బంజారాల  అభివృద్ధి
  • బంజారా సంఘం సదర్నాయక్ రాజు నాయక్

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల  కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో బంజారా సోదరుల సంక్షేమం కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎనలేని కృషి చేస్తున్నాడని బంజారా సంఘం సదర్నాయక్ రాజు నాయక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా ఆరాధ్య దేవుడు జగదంబ మాత ఆలయాన్ని నిర్మించేందుకు మండల కేంద్రంలో భూమి కొనుగోలు చేయగా ఆర్టి స్థలం మాదేనని ముస్లింకు చెందిన కొందరు కోర్టును ఆశ్రయింన విషయం తెలిసిందే.గతంలో సర్వే నెంబర్ 787 లో సేవాలాల్ మహారాజ్ జయంతిని,దసరా ఉత్సవాలను బంజారా సోదరులు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు.అట్టి స్థలంలోనే తీజ్ పండుగను నిర్వహించడానికి బంజారా సోదరులు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్లు తమను అరెస్టు చేసి అవమాన  పరిచారన్నారు.గిరిజన సమాజం ఒకటై పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాట వాస్తవమేనన్నారు. ఈ సంఘటనలో కొందరు ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసి తమ పార్టీ పై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు,బంజారా సంఘం జిల్లా సదర్నాయక్ రాజు నాయక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాము చింతిస్తున్నామని ఈ సందర్భంగా  తెలిపారు.పోలీసుల చర్యను తప్పు పట్టడానికి మాత్రమే ఏకమై  పోలీస్ స్టేషన్ కు రావడం జరిగిందన్నారు.విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ  సెల్ నాయకులు తుకారాo నాయక్,మోతిలాల్ నాయక్, మూడవత్ నారాయణ, వసంతరావు,రవీందర్ నాయక్.బాబురావు,అంబర్ సింగ్ నాయక్,సుధాకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article