ఏపీలోని సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రకలకలం
ఐబీ అధికారుల అదుపులో నిందితుడు
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీ లోని శ్రీసత్య సాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట ఏరియాలోని అతని ఇంట్లో ఐబీ, ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. అక్కడ అనుమానిత వస్తువులు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నూర్ మహమ్మద్ పాకిస్థాన్ కు కాల్ చేస్తూ అక్కడి ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఐబీ అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ధర్మవారం మార్కెట్ వీధిలోని టీస్టాల్ పని చేస్తున్నట్లు గుర్తించారు.
