28.8 C
Hyderabad
Monday, August 3, 2026

పంద్రాగస్టు వేడుకల్లో జెండా ఎగుర వేసేది వీరే

Must read

📰 Generate e-Paper Clip

  • 32 మందితో కూడిని జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
  • నిజామాబాద్ లో నిరంజన్
  • కామారెడ్డిలో ఎం.కోదండరెడ్డి

 

వెబ్ డెస్క్, బతుకమ్మ: తెలంగాణలో ఈ నెల 15న జరిగే 79వ భారత స్వాతంత్ర్య వేడుకలకు జెండా ఎగురవేసేందుకు అతిథులను ఖరారు చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రి వర్గ విస్థరణ జరుగకపోవడం, కొత్త జిల్లాలో ఎగుర వేసేందుకు సరిపడ మంత్రులు లేకపోవడంతో విప్ లతో పాటు వివిధ కార్పొరేషన్ ల చైర్మెన్ ల ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధికారికంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో  తెలంగాణ బిసీ కమీషన్ చైర్మెన్ నిరంజన్, కామారెడ్డి జిల్లాలో తెలంగాణ అగ్రీకల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్పేర్ కమీషన్ చైర్మెన్ కోదండ రెడ్డి జాతీయ జండాలను ఎగుర వేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లా అధికార యంత్రంగాలకు సమాచారం అందించింది ప్రభుత్వం.

More articles

Latest article