26.2 C
Hyderabad

అభివృద్ధి పనుల పేరిట గుట్టలు మాయం

Must read

📰 Generate e-Paper Clip

  • గుట్ట ప్రాంతంలో అక్రమంగా మొరం త్రవ్వకాలు
  • చెట్లు, కొండలను కొల్లగొడుతున్న వైనం

 

రుద్రూర్, బతుకమ్మ : కొందరు అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా మొరం త్రవ్వకాలు చేపడుతూ గుట్టలను కొల్లగొడుతున్నారు. బుధవారం అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో అనుమతులు లేకుండా మొరం త్రవ్వకాలు చేపడుతుండడంతో, మొరం త్రవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. 765 -డి జాతీయ రహదారి నిర్మాణం పేరిట అక్రమంగా మొరం త్రవ్వకాలు

Hillsides disappear in the name of development work

చేపడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో కబ్జా భూమిలో భారీ వాహనాలతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమంగా మొరం త్రవ్వకాలు చేపడుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో పట్టా ఇస్తానని హామీ ఇచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కానీ వర్ని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా భూమిలో అక్రమంగా మొరం త్రవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్థులు వాపోయారు. ఈ విషయం పై తహసీల్దార్ తారాబాయికి వివరణ కోరగా మొరం త్రావ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానమిచ్చారు.

Hillsides disappear in the name of development work

More articles

Latest article