- జాతీయ పసుపు బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి
మోర్తాడ్, బతుకమ్మ: మనదేశంలో పది లక్షలకు పైగా ఎకరాలలో పసుపు పంట సాగుతుందని, గల్ఫ్ దేశాలకు మన పసుపు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందని దాని విలువ రూ.1876 కోట్లు ఈ సంవత్సరం 5000 కోట్లకు పెంచాలని పసుపు బోర్డు నిర్ణయం తీసుకుందని జాతీయ పసుపు బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. రానున్న రోజులలో ఆర్గానిక్ పసుపు పండించడం వల్ల కర్క్యూమిన్ శాతం పెంపు రంగు, సువాసన నిలువ ఆధునిక ఎండబెట్టే పద్ధతులు ఎగుమతులకు తగిన ప్యాకేజీ ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో బుధవారం నిర్వహించిన పసుపు పంట పై నాణ్యత పెరుగుదల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీనిని పండించడం వల్ల రైతులకు దిగుబడి తగ్గిన మరింత ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. సాధారణంగా మనం చేసే వ్యవసాయంలో యూరియాని తగ్గించుకొని క్రిమి సంహారక మందులు తగ్గించుకుంటే మంచిదిని తెలియచేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు లోను సౌకర్యాలు మార్కెట్ అవకాశం పై సమాచారం తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో స్పైస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సుందరేషన్, మోర్తాడ్ మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్, ఆర్టికల్చర్ ఆఫీసర్ రాజు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.