మోర్తాడ్, బతుకమ్మ : అందరం కలిసి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని డ్రగ్స్ వినియోగాన్ని అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా నిషేధమని మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. పెద్దన్న అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో బుధవారం నషా ముక్తాభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ రైత సమాజాన్ని నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేశారు. వాటి సమాచారాన్ని అధికారులకు తెలుపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మర్రిపల్లి భూపతి, అకాడమీ కోఆర్డినేటర్ దశరథ్, సీనియర్ అధ్యాపకులు రవీందర్, రాజయ్య అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
