27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కమల్‌ హాసన్‌ తల నరికేస్తా

Must read

📰 Generate e-Paper Clip

తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ బెదిరింపులు

వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌కు తల నరికేస్తా అంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల కమల్‌ హాసన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయనపై తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్‌ హాసన్ తల నరికేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే రవిచంద్రన్‌పై కమల్‌ హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు. రవిచంద్రన్ చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని, వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఇటీవల అగరం ఫౌండేషన్ వేడుకలో కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. సనాతన సిద్ధాంతాలను బ్రేక్‌ చేసే ఆయుధం విద్య అని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈవ్యాఖ్యలను రవిచంద్రన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే బీజేపీ శ్రేణులు, సనాతన ధర్మాన్ని పాటించేవారు కూడా ఆయనపై విమర్శలు చేశారు. కమల్‌ హాసన్ తల నరికేస్తానని రవిచంద్రన్ బెదిరించడం సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. సోషల్ మీడియాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

More articles

Latest article