29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

 రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓట్ల చోరీపై  ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

పార్లమెంట్ టూ ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ తీసిన విపక్ష ఎంపీలు

డిల్లీ, బతుకమ్మ :  విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీహార్ లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది.  గత లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవర్ పాల్గొన్నారు. ఈర్యాలీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  ర్యాలీని మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎంపీ అఖిలేష్ యాదవ్, తదితర నేతలు బారికేడ్లు ఎక్కి నిరసన కొనసాగిస్తున్నారు.

Rally against vote theft led by Rahul Gandhi

More articles

Latest article