- పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న డిగ్రీ, పీజీ కళాశాలలు తేలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కి పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ పీజీ విద్యార్థులు సర్టిఫికెట్లు, ఇతర అవసరాలకోసం కాకతీయ యూనివర్సిటీ కి 200 కిలోమీటర్లకు పైగా వెళ్లవలసి వస్తుందని , పని కాకపోతే అక్కడే ఉండడానికి అనేక ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రెండు జిల్లాలకు తెలంగాణ యూనివర్సిటీ 100 కిలోమీటర్ల లోపు ఉంటుందని, మిగతా ఇంజనీరింగ్ కోర్సులు లతో పాటు యూనివర్సిటీ పరిధిని విస్తరించాలని కోరారు. తేయూ పరిధిలో ఉన్న డిగ్రీ పీజీ కోర్స్ ల ఫీజులను తగ్గించాలని, ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని, కోర్సు ఫీజుకు తగ్గట్టుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు ప్రిన్స్, దేవిక, రాకేష్, లహరి, రాజేష్, వంశీ తదితదిరులు పాల్గొన్నారు.
