30.9 C
Hyderabad
Monday, August 3, 2026

హాస్టల్ వార్డెన్ వైద్యానికి అసోసియేషన్ సహాయ సహకారాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్సీ సంక్షేమ శాఖలో కామారెడ్డి జిల్లా జుక్కల్ వసతి గృహాధికారిగా పనిచేస్తున్న రాజేందర్  ఈ నెల 6 ప్రమాదానికి గురై తలకు బలమైన గాయాలు కావడంతో నిజామాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు చెందిన వసతి గృహాధికారులు అందరు కలిసి రూ.80,000ఆర్థిక సహాయాన్ని  శుక్రవారం రాజేంధర్ కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వసతి గృహ అధికారుల సంఘం అధ్యక్షులు సురేష్, రాష్ట్ర వసతి గృహ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మచ్చేంధర్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో హాస్పిటల్ కు వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెబుతూ నగదును వారి వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.స్వామి, నవీన్ ఇతర టీఎన్జీవోస్ సభ్యులు, వసతి గృహ అధికారులు పాల్గొన్నారు.

Association provides assistance to hostel warden for medical treatment

More articles

Latest article