24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి

Must read

📰 Generate e-Paper Clip

  • టీజి ఎండీఎస్ చైర్మన్ ఈరవత్రి అనిల్

 

భీమ్ గల్, బతుకమ్మ : వెనుకబడిన కులాల (బీసీ)కు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనిర్వహించతలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కోరారు. ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ 42% శాతం బిసి రిజర్వేషన్ల అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో  ఢిల్లీ లోని జనతార్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 5,6,7తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాకు 25 మంది చొప్పున తరలిరావాలని ఆయన కోరారు. ఈ నెల 5 హైదరాబాద్ నుండి ఫ్రీ ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరిగి ఆదే ట్రైన్ 7న తిరిగి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నాయకులు ఆధార్ కార్డు తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని డీసీసీ ప్రెసిడెంట్లు ప్రత్యేక చొరవ చూపి విజయవంతం చేయాలని ఈరవత్రి విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article