28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బస్టాండ్, రైల్వే స్టేషన్ బాంబ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపి సాయి చైతన్య ఆదేశానుసారం వన్ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో పోలీసులు నిజామాబాద్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఏఎస్ఐ హబీబ్ అహ్మద్ పర్యవేక్షణలో బుధవారం సాయంత్రం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లపై బాంబ్ స్క్వాడ్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అసాంఘీక శక్తుల సంచారంతో పాటు నిషేధిత పదార్థాలను పట్టుకునేందుకు గాను సాధారణ తనిఖీలలో భాగంగానే బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలను నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ప్రజా రవాణా ప్రాంతంలో ఎలాంటి అనుమానిత వస్తువులు ఉన్న ముట్టుకోకూడదని వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీలలో వన్ టౌన్ పోలీసులు పాల్గొన్నారు.

Police conduct checks with bomb squad at bus stand and railway station

More articles

Latest article