26.3 C
Hyderabad
Monday, August 3, 2026

లక్ష సుపారీ ఇచ్చి భర్త హత్యకు స్కెచ్ గీసీన భార్య

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు యత్నం
  • మైనర్ తో సహా ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : భర్త పాస్ పోర్ట్ సైజ్ పోటో ఇచ్చి అతనిని హత్య చేసిన వారికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రియుడికి ఆఫర్ చేసింది భార్య. ప్రియురాలే లక్ష రూపాయలు ఇచ్చి భర్తను మట్టుబెట్టుమంటే చేతికి మట్టి అంటకుండా తనకు తెలిసిన వారిద్వారా పక్కా స్కేచ్ గీశాడు ప్రియుడు. పథకం ప్రకారం ప్రియురాలి భర్తకు అప్పు ఇప్పించే వంకతో నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ పూటుగా మద్యం తాగించి మట్టుబెట్టాలని ఉద్ధేశంలో భాగంగా సుత్తితో మోది దాడి చేశారు ప్రియుడు అండ్ గ్యాంగ్. కానీ ప్రాణాల మీద ఆశతో అ వ్యక్తి వారి నుంచి జరిగిన దాడిలో రక్తమోడుతున్నా తప్పించుకుని పారిపోయి ప్రాణాలను దక్కించుకున్నాడు. చివరకు పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో ప్రియురాలు, ప్రియుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి కటా కటాల వెనక్కి పంపినట్టు ఎల్లారెడ్డి డిఎస్పీ  శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడిస్తు…. నాగిరెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన పల్లే రవి అనే వ్యక్తి ఈ నెల 24న తనపై తన భార్య సంపూర్ణ తో పాటు అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జాన్సన్, నవీన్ మరికొందరు దాడి చేసి గాయపరిచారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు నాగిరెడ్డి పేట్ పోలీసులు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో నాగిరెడ్డి పేట్ ఎస్ఐ అగస్త్య భార్గవ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి… చిన్న ఆత్మకుర్ గ్రామంలో ఆశ వర్కర్ గా పనిచేసే 35 సంవత్సరాల సంపూర్ణకు 23 సంవత్సరాల వయస్సు కలిగిన అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జాన్సన్ తో వివాహేతర సంబంధం ఉంది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్త రవిని మట్టుబెట్టాలని సంపూర్ణ ప్లాన్ వేసింది. అందుకు గాను తన భర్తను చంపిన వారికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రియుడికి తెలిపి రవికి సంబంధించిన పాస్ పోర్ట్  సైజ్ ఫొటోను గుర్తు పట్టేందుకు గాను ఇచ్చింది. ప్రియురాలి ఆపర్ లక్ష రూపాయలు నచ్చగా ఆమె భర్త లేకుంటే తమ శారీరక సంబంధానికి అడ్డు అదుపు ఉండదని ప్రియుడు రవి పక్కా స్కేచ్ వేశాడు. తనకు తెలిసిన మేస్త్రి పనిచేసే తాండూర్ గ్రామానికి చెందిన చాకలి రాజు, చిన్న అత్మకుర్ కు చెందిన మరో ట్రాక్టర్ డైవర్ ఆర్.నవీన్, నాగిరెడ్డి పేట్ మండలానికి చెందిన మైనర్ బాలుడిని ఒప్పించారు. పథకం ప్రకారం ఈ నెల 24న రవికి అప్పు ఇప్పిస్తామని ఆశ చూపి పెద్దరెడ్డి డంపింగ్ యార్డ్ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ అందరు మద్యం సేవించారు. రవి మద్యం మత్తులో ఉండగా జాన్సన్, చాకలిరాజులు కలిసి సుత్తెతో రవిపై దాడి చేశారు. రవి వారి దాడినుంచి తప్పించుకొని స్థానికంగా ఒక ఫాం హౌస్ వైపు పరిగెత్తాడు. రవిపై మరోసారి జాన్సన్ దాడికి పాల్పడ్డాడు. అయినప్పటికి ఫాం హౌజ్ లోకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం రవి భార్య సంపూర్ణతో పాటు ప్రియుడు రవి, చాకలి రాజు, నవీన్, మైనర్ బాలుడితో పాటు రెండు బైక్ లు, రక్తపు మరకలు కలిగిన బట్టలు, సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ సుంకర శ్రీనివాస్ తెలిపారు.

Wife draws sketch of husband's murder after paying him 1 lakh betel nuts

More articles

Latest article