30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటుకు రుద్రూర్ పరిశోధన కేంద్రం అనువైన స్థలం

Must read

📰 Generate e-Paper Clip

  • పరిశోధన కేంద్రానికి సొంతగా 320 ఎకరాల స్థలం ఉంది
  • ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని చెఱకు, వరి పరిశోధన కేంద్రంలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటుకు   100 శాతం అనువైన ప్రదేశమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం రుద్రూర్ పరిశోధన కేంద్రాన్ని  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ తో పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే కొత్త వంగడాలను సృష్టించే పరిశోధన కేంద్రం రుద్రూర్ చెఱకు, వరి పరిశోధన కేంద్రం అని ఆయన అన్నారు. 2016 వ సంవత్సరంలో ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలను తీసుకొచ్చామన్నారు. ఈ ఫుడ్ సైన్స్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు, నాణ్యమైన భోజనం వసతి సౌకర్యం ఉందన్నారు. అదేవిధంగా ఫుడ్ సైన్స్ కళాశాలకు సంబంధించిన సరిపడ గదులు, బాలుర, బాలికల వసతి గృహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పరిశోధన కేంద్రానికి 320 ఎకరాల స్వంత స్థలం ఉందని ఆయన వివరించారు. రుద్రూర్ లో బిఎస్సి అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడానని అన్నారు. నూటికి నూరు శాతం రుద్రూర్ లో బిఎస్సి అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటుకు   అనువైన ప్రదేశమని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, శాస్త్రవేత్తలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారాం, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్, పత్తి లక్ష్మణ్, నడిపింటి నగేష్, షేక్ ఖాదర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Rudrur Research Centre is a suitable place for setting up a B.Sc. Agriculture College

More articles

Latest article